సీఎం సహాయనిధికి ఎన్ ఎస్ ఎల్ గ్రూపు 50 లక్షలు విరాళం ఇచ్చింది. క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను కలిసిన ఎన్ ఎస్ ఎల్ గ్రూపు ఛైర్మన్ ఎం.ప్రభాకరరావు, ఎండీ ఎం.వెంకటరామచౌదరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెక్కు అందించారు. విరాళంతో పాటు కోటి రూపాయలు విలువైన శానిటైజర్లు పంపిణీ చేయనున్నట్టు ఎన్ఎస్ఎల్ గ్రూపు తెలిపింది.
సీఎం సహాయనిధికి ఎన్ఎస్ఎల్ గ్రూప్ రూ.50 లక్షల విరాళం - cm jagan
కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కరోనాపై పోరుకు ముఖ్యమంత్రి సహాయనిధికి ఎన్ఎస్ఎల్ గ్రూప్ 50 లక్షల రూపాయల విరాళం ఇచ్చింది.
cm viralam