ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రంలో మత మార్పిడులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?' - religious conversions in the state

రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రైస్తవ మతంలోకి ప్రజలను మారుస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 15 రోజుల్లోగా నివేదిక అందజేయాలని సీఎస్​కు నోటీసులు జారీ చేసింది.

ncsc
ncsc

By

Published : Jul 22, 2021, 9:18 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున ఎస్సీలను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని ఎస్సీ, ఎస్టీ హక్కుల ఫోరం జాతీయ అధ్యక్షుడు నాగరాజు అందించిన ఫిర్యాదుపై.. జాతీయ ఎస్సీ కమిషన్‌ స్పందించింది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి ఇటీవల నోటీసులు జారీచేసింది.

ఈ అంశంపై విచారణ చేయాలని కమిషన్‌ భావిస్తున్నట్లు తెలిపింది. మత మార్పిడి ఫిర్యాదు / ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గడువులోగా సమాధానం పంపకపోతే కమిషన్‌ ముందు స్వయంగా హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేస్తామని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details