కొందరి స్వార్థం కోసం రాజధాని తరలింపు చేపట్టడం అన్యాయమని తెదేపా శానససభ్యుడు అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. వికేంద్రీకరణ పేరుతో తప్పుడు ప్రచారం చేపట్టి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే గాజువాక లాంటి ప్రాంతంలో రాజధాని పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఎన్నో అభివృద్ది పథకాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించి చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు. అహంకారపూరిత విధానాలతో ముందుకెళ్తే తప్పకుండా దెబ్బతింటారని హెచ్చరించారు.
కొందరి స్వార్థం కోసమే రాజధాని తరలింపు: అనగాని - అసెంబ్లీ తాజా వార్తలు
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని తెదేపా శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి స్వార్థం కోసం రాజధానిని తరలిస్తున్నారని విమర్శించారు.
అనగాని