ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Prisoners: ఖైదీల్లో హత్యా నేరాల్లో శిక్ష పడిన వారే ఎక్కువ

Prison Statistics Report: రాష్ట్ర జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 70 శాతం మంది హత్యా నేరాల్లో శిక్ష పడినవారే. 2021 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలోని జైళ్లలో 2,104 మంది శిక్ష పడిన ఖైదీలు (కన్విక్టెడ్‌ ప్రిజనర్స్‌) ఉండగా వారిలో 1,472 మంది హత్యా నేరాలపై వచ్చినవారే ఉన్నారు. కేంద్ర కారాగారాల్లో సామర్థ్యానికి మించి అదనంగా 32.3 శాతం మంది ఖైదీలున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘కారాగార గణాంక నివేదిక-2021’ ఈ వివరాల్ని వెల్లడించింది.

Convicted Prisoners
ఖైదీల్లో హత్యా నేరాల్లో శిక్ష పడిన వారే ఎక్కువ

By

Published : Sep 6, 2022, 12:30 PM IST

The Ministry of Home Affairs: రాష్ట్ర జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 70 శాతం మంది హత్యా నేరాల్లో శిక్ష పడినవారే. 2021 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలోని జైళ్లలో 2,104 మంది శిక్ష పడిన ఖైదీలు (కన్విక్టెడ్‌ ప్రిజనర్స్‌) ఉండగా వారిలో 1,472 మంది హత్యా నేరాలపై వచ్చినవారే. జైళ్లలోని ఖైదీల్లో 1,858 మంది (66.64 శాతం) జీవిత ఖైదు అనుభవిస్తున్నవారే. జిల్లా, సబ్‌ జైళ్లు తక్కువ మంది ఖైదీల్ని కలిగి ఉండగా... కేంద్ర కారాగారాల్లో సామర్థ్యానికి మించి అదనంగా 32.3 శాతం మంది ఖైదీలున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘కారాగార గణాంక నివేదిక-2021’ ఈ వివరాల్ని వెల్లడించింది.

ప్రాణాలు తీస్తున్న గుండె జబ్బులు

రాష్ట్రంలోని 106 జైళ్లలో 8,761 మంది ఖైదీలను ఉంచొచ్చు. ప్రస్తుతం 7,950 మంది (90.7 శాతం) ఉన్నారు. సెంట్రల్‌ జైళ్లు వాటి సామర్థ్యానికి మించి ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. వాటి సామర్థ్యం 3,764 మంది అయితే ప్రస్తుతం 4,978 మంది ఉంటున్నారు.

*జైళ్లలో 2021లో అనారోగ్య కారణాలతో 40 మంది ఖైదీలు మరణించగా... వారిలో 24 మంది గుండె, ముగ్గురు కాలేయ సంబంధిత వ్యాధులతో చనిపోయారు. ఐదుగురు ఖైదీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

*జైళ్లలోని 7,950 మంది ఖైదీల్లో 224 మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు.

30-50 ఏళ్ల మధ్య వయసు... చదువు పదో తరగతి లోపు..

*పీలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న, రిమాండులో ఉన్న ఖైదీల్లో అత్యధిక శాతం మంది 30-50 ఏళ్ల లోపు వయసు వారే. చదువు రానివారు, పదో తరగతి లోపు ఆపేసిన వారు ఎక్కువ మంది.

జీవిత ఖైదు అనుభవిస్తున్న వారే అధికం

జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 75.7 శాతం మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారే. 2-4 ఏళ్ల లోపు శిక్ష అనుభవించేవారు అతి తక్కువ మంది ఉన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details