ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 29, 2020, 12:34 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే..?

కరోనాపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్​ బులెటిన్ విడుదల చేసింది. ఈరోజు జరిపిన పరీక్షలు, నిర్థరణ వివరాలతో పాటు తీసుకుంటున్న చర్యలపై వివరాలను వెల్లడించింది.

health bullitin of ap
health bullitin of ap

రాష్ట్రంలో కొవిడ్ - 19 కేసులపై వైద్యారోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ 16 శాంపిల్స్​ను పరీక్షించగా నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించింది. ఈ రోజు విదేశాల నుంచి ఎవరూ రాలేదని పేర్కొంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 29,367 అని స్పష్టం చేసింది.

క్వారంటైన్ వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా 29,172 మందిని హోం క్వారంటైన్​లో ఉంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 195 మంది ఆస్పత్రుల్లో ఉన్నారని తెలిపింది. ఇప్పటి వరకు 433 శాంపిల్స్​ల్లో 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేసింది. రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ కాగా.. అతను హైదరాబాద్​లోని గాంధీ మెడికల్​ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది.

అనంతపురంలో కరోనా నిర్ధారణ కేంద్రం

రాష్ట్రంలో ఇప్పటికే చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా నిర్ధారణ కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వం... తాజాగా అనంతపురంలో మరో కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. కరోనాకు సంబంధించి శనివారం 537 ఫోన్ కాల్స్ వచ్చాయని.. వాటిపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బులెటిన్​లో ప్రస్తావించింది.

ఇదీ చదవండి:

కరోనాపై గెలిచిన హైదరాబాదీకి మోదీ ఫోన్​

ABOUT THE AUTHOR

...view details