ఆక్సిజన్ సరఫరాలో భారతీయ రైల్వే.. మరో కీలక మైలు రాయిని అధిగమించింది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 1,142 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను రవాణా చేసినట్లు శాఖ వెల్లడించింది. గత 20వ తేదీన 1, 118 మెట్రిక్ టన్నులు రవాణా చేయగా.. ఇవాళ దాన్ని అధిగమించినట్లు తెలిపింది.
ఈ నెలలో ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు 16వేల మెట్రికల్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇంతవరకూ చేరుకున్న రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు.. ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోం ఉన్నాయి. నెల రోజులుగా శ్రమిస్తూ.. ఆక్సిజన్ సరఫరాలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషించింది. ఆక్సిజన్ కొరతను తప్పించి.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది.