ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రేమను మింగేసిన కలహం... భార్యను చంపిన భర్త

ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి అన్యోన్య జీవితానికి గుర్తుగా ఓ బాబు కూడా ఉన్నాడు. అంతలోనే కుటుంబ కలహాలు వారి సంసారంలో నిప్పులు పోశాయి. భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

married women killed at manchiryala
మంచిర్యాలలో వివాహిత హత్య

By

Published : May 8, 2020, 2:36 PM IST

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని మల్లికార్జున్ నగర్​లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో సురేశ్​ అనే వ్యక్తి తన భార్య సంధ్యను హత్యచేశాడు.

పట్టణానికి చెందిన సురేశ్​, సంధ్యలు ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేశ్​ ఆటోడ్రైవర్​గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం వల్ల వారం రోజుల క్రితం సంధ్య మల్లికార్జున్​నగర్​లోని తన పుట్టింటికి వచ్చింది.

గురువారం రాత్రి అత్తవారింటికి వచ్చిన సురేశ్..​ ఇంట్లో ఉన్న గడ్డపారతో సంధ్యను పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన సంధ్య అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం సురేశ్​ పోలీసులకు లొంగిపోయారు.

ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ రహమాన్, మందమర్రి సీఐ మహేశ్​, రామకృష్ణాపూర్​ ఎస్సై రవిప్రసాద్​లు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మంచిర్యాలలో వివాహిత హత్య

ఇదీచూడండి:ప్రేమోన్మాది ఘాతుకం: విద్యార్థిని గొంతు కోసిన ఆటో డ్రైవర్

ABOUT THE AUTHOR

...view details