ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారి బెయిల్​ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరణ - కర్నూలు జిల్లాలో తెదేపా నేతల దారుణ హత్య

గతేడాది జూన్​లో కర్నూలు జిల్లాలో తెదేపా నేతల దారుణ హత్య కేసులో నిందితులకు దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్​ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. మరోవైపు అభియోగపత్రం దాఖలు చేసేంత వరకు నిందితులు పెసరవాయిలోకి వెళ్లడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు మృతుల్లో ఒకరైన ప్రతాప్ రెడ్డి భార్య లక్ష్మిదేవి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది.

HC
HC

By

Published : Mar 2, 2022, 4:41 AM IST

కర్నూలు జిల్లా గడివేముల మండలం పెనరవాయి గ్రామంలో గతేడాది జూన్​లో జరిగిన తెదేపా నేతల హత్య కేసులో నిందితులకు దిగువ కోర్టు ఇచ్చిన బెయిలును రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అస్పష్ట ఆరోపణల ఆధారంగా బెయిలు రద్దు చేయలేమని తెలిపింది. మృతుల్లో ఒకరైన ప్రతాప్ రెడ్డి భార్య లక్ష్మిదేవి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది. మరోవైపు అభియోగపత్రం దాఖలు చేసేంత వరకు నిందితులు పెసరవాయిలోకి వెళ్లడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈమేరకు తీర్పు ఇచ్చారు.

గతేడాది జూన్లో తెదేపా నేతలు , సోదరులైన వడ్డు ప్రతాప్ రెడ్డి,వడ్డు నాగేశ్వరరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గడివేముల పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పటిషన్​ను నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు రెండు సార్లు కొట్టేసింది. మూడో సారి వేసిన పిటిషన్లను అనుమతిస్తూ 2021 సెప్టెంబర్ 13న బెయిలు ఇచ్చి.. షరతులు విధించింది. నిందితులు ద్వారం శ్రీకాంత్రెడ్డి , ద్వారం రాజేశ్వరరెడ్డి , ద్వారం కేదారనాథ్ రెడ్డి తదితరులు సాక్షులను బెదిరిస్తున్నారని వారి బెయిలును రద్దు చేయాలని కోరుతూ మృతుడు ప్రతాప్ రెడ్డి భార్య లక్ష్మిదేవి హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ మొదటి రెండు బెయిలు పిటిషన్లు తిరస్కరించే సమయంలో ఉన్న పరిస్థితులే మూడో బెయిలు పిటిషన్ అనుమతించే సమయంలో ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో దిగువ కోర్టు బెయిలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. నిందితులు వారి మనుషులతో సాక్షులను బెదిరిస్తున్నారన్నారు.

పోలీసుల తరఫున అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి వాదిస్తూ .. సాక్షులను బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందలేదన్నారు. ఇప్పటికే 48 మంది సాక్షులను విచారించామన్నారు. అభియోగపత్రం వేసేందుకు ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నామన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు భద్రత కల్పించిన విషయాన్ని మూడో బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా దిగువ కోర్టు పరిగణనలోకి తీసుకుందన్నారు. మొదటి పిటిషన్​ను మూడో బెయిలు పిటిషన్ దాఖలు చేసే సమయానికి పరిస్థితుల్లో మార్పులేదన్న ఒక్క కారణంతో బెయిలు రద్దు చేయలేమన్నారు. బెయిలు ఎలాంటి సందర్భాల్లో రద్దు చేయవచ్చో సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొందని గుర్తుచేశారు .
ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో ఇద్దరు తెదేపా నాయకుల దారుణ హత్య..!

ABOUT THE AUTHOR

...view details