High Court angry with CID అవినీతి కేసుల్లో సీఐడీ దర్యాప్తు తీరుపై హైకోర్టు మండిపడింది. సాక్షులను 4 నెలలకు ఒకరిని, ఏడాదికి మరొకరిని విచారిస్తున్నారా? అంటూ నిలదీసింది. ఈ కేసుల్లో జాప్యాన్ని సహించబోమని హెచ్చరించింది. 2017లో నమోదు చేసిన కేసులో ఇప్పటివరకు పురోగతి లేకపోవడంపై ఆగ్రహించింది. సీఐడీ అధిపతి ఎవరని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి సీఐడీ అధిపతి అని జీపీ మహేశ్వరరెడ్డి బదులిచ్చారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. 2017నుంచి ఈ తరహా కేసులు ఇప్పటివరకు ఎన్ని నమోదు చేశారు? వాటి పురోగతి ఏమిటి? పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని, అఫిడవిట్ సమర్పించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. విచారణను సెప్టెంబరు 14కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలిచ్చింది. కర్నూలులోని రాయలసీమ వర్సిటీలో 2007-12 మధ్యలో జరిగిన వివిధ కొనుగోళ్ల చెల్లింపుల్లో రూ.1.46 కోట్లు దుర్వినియోగమయ్యాయంటూ 2013లో విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చినా.. సీఐడీ విచారణలో పురోగతి లేదంటూ ఏఐఎస్‌ఎఫ్ నేత ఎం.కల్లప్ప హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
High Court on CID ఏడాదికొక సాక్షిని విచారిస్తున్నారా, సీఐడీపై హైకోర్టు ఆగ్రహం - ఏపీ హైకోర్టు
High Court angry with CID అవినీతి కేసుల విచారణలో జాప్యాన్ని సహించేది లేదని హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ మేరకు సీఐడీ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలులోని రాయలసీమ వర్సిటీలో కొనుగోళ్లు, చెల్లింపుల విషయంలో విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చినా సీఐడీ విచారణలో పురోగతి లేదని పేర్కొంటూ ఏఐఎస్‌ఎఫ్ నేత కల్లప్ప హైకోర్టులో పిల్ వేశారు. ఇందులో 16 మంది సాక్షుల్ని విచారించామని, కౌంటర్ వేయడానికి సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాది కోరడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏడాదికొక సాక్షిని విచారిస్తారా అని నిలదీసింది.
గతంలో ఈ వ్యాజ్యంపై విచారించిన ధర్మాసనం.. ప్రతివాదులుగా ఉన్నవారికి నోటీసులిచ్చింది. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ.. మొత్తం బిల్లుల్లో రూ.1.39 కోట్ల చెల్లింపుల వోచర్లను సమర్పించడంలో అధికారులు విఫలమయ్యారని, రూ.7.70 లక్షల విలువ ఫర్నిచర్ దుర్వినియోగం చేశారంటూ విజిలెన్స్ తేల్చిందని తెలిపారు. రూ.1.46 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని 2013 డిసెంబరులో విజిలెన్స్ నివేదిస్తూ క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసిందని తెలిపారు. న్యాయస్థానం పలుమార్లు అవకాశమిచ్చినా ఈ వ్యాజ్యంలో ప్రతివాదులు కౌంటర్ వేయలేదని వివరించారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సీఐడీ తరఫు న్యాయవాదిని వివరణ కోరింది. 16 మంది సాక్షులను విచారించామని ఆయన బదులిచ్చారు. ఈ పురోగతిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి: