రాష్ట్రంలోని దిగువస్థాయి న్యాయవ్యవస్థలోని సభ్యులపై చేసే ఫిర్యాదుతోపాటు ప్రమాణపత్రం, ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు సమర్పించాలని, లేదంటే ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు రిజిస్ట్రార్(నియామకాలు), ఎఫ్‌ఏసీ రిజిస్ట్రార్ విజిలెన్స్ సునీత ఉత్తర్వులు జారీచేశారు. పేరు, సంతకం, ప్రమాణపత్రం, ఆరోపణలకు బలం చేకూర్చే వివరాలు లేకుండా అందుకున్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు ఉండవన్నారు. అయినప్పటికీ వ్యవస్థ ప్రయోజనాల నిమిత్తం ఏ ఫిర్యాదుపైన అయినా విచక్షణాధికారం మేరకు ప్రధాన న్యాయమూర్తి... ప్రాథమిక విచారణకు ఆదేశించొచ్చన్నారు.
విచారణ అనంతరం అది న్యాయవ్యవస్థను ఇబ్బందులకు గురిచేసే ఫిర్యాదు అని తేలినా... ఆరోపణలను నిరూపించలేకపోయినా ఖర్చులు చెల్లించాలని ఫిర్యాదుదారుని ఆదేశించొచ్చన్నారు. గతంలో ఉన్న నిబంధనలకు అదనంగా ఈమేరకు మార్గదర్శకాలు ఇచ్చారు.