ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మధ్యంతర ఉత్తర్వులన్నీ జూన్ 30 వరకు పొడిగింపు - AP HIGH COURT NEWS

హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లు జారీచేసిన మద్యంతర ఉత్తర్వులన్నింటిని జూన్ 30 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మధ్యంతర ఉత్తర్వులన్నీ జూన్ 30 వరకు పొడిగింపు
మధ్యంతర ఉత్తర్వులన్నీ జూన్ 30 వరకు పొడిగింపు

By

Published : Apr 30, 2021, 5:57 AM IST

హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు జారీచేసిన మద్యంతర ఉత్తర్వులన్నింటిని జూన్ 30 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 21 నాటికి అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులను బేషరతుగా పొడిగిస్తున్నట్లు స్పష్టంచేసింది. మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపువల్ల ప్రభావితులయిన వారు ఆ ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుకునే స్వేచ్ఛనిచ్చింది. వ్యాజ్యంపై విచారణను జూన్ 25 కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కరోనా విస్తృతమవుతున్న నేపథ్యంలో న్యాయస్థానాలు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను బేషరతుగా పొడిగించే నిమిత్తం హైకోర్టు సుమోటోగా వ్యాజ్యాన్ని నమోదు చేసింది. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. చాలామంది న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కరోనాతో బాధపడుతున్న విషయాన్ని గుర్తుచేసింది. ఈనేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులన్నింటిని పొడిగిస్తున్నట్లు స్పష్టంచేసింది.

ABOUT THE AUTHOR

...view details