ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT: 'ఇళ్లపథకం'పై అప్పీల్​ను సీజే ముందు ఉంచండి - ఇళ్లపథకం హైకోర్టు ఆదేశాలు

పేదలందరికీ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్​ను తగిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చే వ్యవహారంపై నిర్ణయం తీసుకునేందుకు దస్త్రాన్ని సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఇళ్ల పథకంపై తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి బెంచ్​లో ఉండటంతో దర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

HIGH COURT
HIGH COURT

By

Published : Oct 13, 2021, 3:37 AM IST

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్​ను.. తగిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చే వ్యవహారంపై నిర్ణయం తీసుకునేందుకు దస్త్రాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఆర్.రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ఇళ్లు పథకంలోని లోపాల్నిఎత్తిచూపిన జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి .. వాటిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసేంతవరకు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ వేసింది. దసరా సెలవుల ప్రత్యేక ధర్మాసనం జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి , జస్టిస్ ఆర్.రఘునందన్ రావులతో కూడిన బెంచ్ ముందుకు అప్పీల్ విచారణకు వచ్చింది. సింగిల్ జడ్జిగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి బెంచ్​లో ఉండటంతో అప్పీల్​ను వేరే ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చేలా తగిన నిర్ణయం తీసుకునేందుకు దస్త్రాన్ని సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.


ఇదీ చదవండి

ఇళ్ల పట్టాలకు ఆ స్థలాలొద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details