ఏపీ హైకోర్టుకు నూతనంగా నియమితులై.. బాధ్యతలు చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. శాలువలు కప్పి, జ్ఞాపికలను అందజేసింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి , ఇతర కార్యవర్గం నేతృత్వంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , హైకోర్టు న్యాయమూర్తులు , ఏజీ ఎస్.శ్రీరామ్ , న్యాయవాదులు హాజరు అయ్యారు. సన్మానం అందుకున్న వారిలో జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి , జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ , జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు , జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు , జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి , జస్టిస్ చీమలపాటి రవి , జస్టిస్ వడ్డిబోయిన సుజాత ఉన్నారు. వారి న్యాయప్రస్థానం గురించి కొద్దిసేపు మాట్లాడారు.
హైకోర్టు నూతన న్యాయమూర్తలకు ఘనంగా సన్మానం - ఏపీ హైకోర్టుకు నూతన న్యాయమూర్తులు
హైకోర్టులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తులను హైకోర్టు న్యాయవాదుల సంఘం సన్మానించింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , హైకోర్టు న్యాయమూర్తులు , ఏజీ ఎస్.శ్రీరామ్ , న్యాయవాదులు హాజరు అయ్యారు.

High Court