రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్, జీవోలను సవాలు చేస్తూ వేసిన పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. మరికొన్ని వివరాలు ఇచ్చేందుకు అడ్వకేట్ జనరల్ సమయం కోరారు. శుక్రవారంలోగా అదనపు ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కొత్త ఎస్‌ఈసీ కూడా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వ వివరణపై అభ్యంతరాలుంటే వచ్చే సోమవారం కౌంటర్ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
ఎస్‌ఈసీ ఆర్డినెన్స్‌పై విచారణ ఈనెల 28కి వాయిదా - SEC Ordinance in hicourt update news
ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్, జీవోలను సవాలు చేస్తూ వేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
SEC Ordinance