మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు...నెలకు రూ.15 వేల జీతం! - serbia
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు 15-17 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అధికారుల అంచనా వేస్తున్నారు. వారికి 15 వేల రూపాయల వరకు జీతం ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజేస్‌కార్పొరేషన్ లిమిటెడ్ నేతృత్వంలో మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దుకాణాల్లో పనిచేసేందుకు పొరుగు సేవల విధానంలో సిబ్బందిని సమకూర్చుకోవాలని భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల్లో నలుగురు, పట్టణ ప్రాంతాల్లోని దుకాణాల్లో 5 మంది చొప్పున సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ విధివిధానాలు సిద్ధం చేస్తోంది. సిబ్బందిని మూడు విభాగాలుగా వర్గీకరించి... ఎవరికి ఎంత వేతనమివ్వాలనేది నిర్ణయించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 4880 మద్యం దుకాణాలున్నాయి. కొత్త మద్య విధానంలో 876 దుకాణాలు( 20 శాతం) తగ్గనున్నాయి. వాటిల్లో పనిచేసేందుకు 15 వేల నుంచి 17 వేల మంది వరకూ సిబ్బంది అవసరమవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు . వీరికి నెలవారీ వేతనం కూడా 15 వేల రూపాయల వరకు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎంత కాలవ్యవధి కోసం వీరిని తీసుకోవాలనేదానిపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.