రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 195 కోట్ల రూపాయల మేర యాన్యుటీ చెల్లింపులకు నిధులు విడుదల అయ్యాయి. రాజధాని రైతులకు వార్షిక కౌలుగా ఈ మొత్తాన్ని చెల్లించేందుకు విడుదల చేశారు. ప్రభుత్వం దీనికి సంబంధించి పాలనానుమతి మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమ చేయాల్సిందిగా అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధానిప్రాంత రైతులకు రూ.195 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.195 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
రాజధాని రైతులకు వార్షిక కౌలు