ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 8, 2020, 6:32 AM IST

ETV Bharat / city

విద్యార్థుల ఎంపికను తాత్కాలికంగా నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశం

విదేశీ విద్య పథకం కింద కొత్తగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలిచ్చింది. ఈ పథకాన్ని పూర్తిగా సమీక్షించాలని స్పష్టం చేసింది. విదేశీ విద్య కింద గతంలో ఆర్థికసాయం పొందినవారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎలాంటి ప్రగతి సాధించారు? వంటి వివరాలను సేకరించాలని నిర్ణయించింది.

study
study

విదేశీ విద్య పథకం కింద కొత్తగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలిచ్చింది. కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా నిలిపేయడంతో పథకం కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. విదేశీ విద్యను ప్రభుత్వం కొనసాగించే అవకాశాల్లేవని సంక్షేమ శాఖల అధికారులు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.లక్షల సాయం అందించడానికి బదులు స్థానికంగా చదివే విద్యార్థుల్లో ఎక్కువ మందికి సాయం అందించవచ్చనే భావనలో ప్రభుత్వమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

విదేశీ విద్య పథకం ప్రయోజనాలను పొంది ఎంతో మంది చురుకైన దిగువ మధ్యతరగతి విద్యార్థులు తమ కలలను నిజం చేసుకున్నారు. ఈ పథకాన్ని 2013లో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రారంభించారు. 2014 తర్వాత బీసీ, కాపు, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం వర్తింపజేసి ఆర్థికసాయం అందిస్తోంది. అమెరికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్‌, రష్యా, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, ఫిలిప్పీన్స్‌, కజకిస్థాన్‌, చైనా తదితర 15 దేశాల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ చదివేందుకు ఆర్థికసాయం అందిస్తోంది.

ఇదీ చదవండి:కరోనా కట్టడికి 'జన్‌ ఆందోళన్‌' ప్రారంభించనున్న మోదీ

ABOUT THE AUTHOR

...view details