రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రైల్వే విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఉన్న హరీష్ కుమార్ గుప్తాను హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను.. రైల్వే ఏడీజీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
IPS transfers: రాష్ట్రంలో మరో ఇద్దరు ఐపీఎస్‌ల బదిలీ.. ఎక్కడికంటే..! - తెలుగు వార్తలు
రాష్ట్రంలో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను, రైల్వే విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఉన్న హరీష్ కుమార్ గుప్తాను బదిలీ చేసింది.
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్, జూనియర్ స్థాయిలో అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. డీజీపీ కార్యాలయంలో ఐజీపీ హోదాలో పని చేస్తున్న ఎల్ కే వి రంగారావుకు పోలీసు సంక్షేమం, క్రీడల విభాగం ఐజీపీగా నియమించారు. అదనపు డీజీ రైల్వే విభాగం అదనపు బాధ్యతలనూ అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 17 మంది ఐపీఎస్‌లను పోస్టింగ్‌లలో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇదీ చదవండి:IPS transfers: రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీ.. ఎవరెవరు ఎక్కడికి..!