ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శిగా.. శామ్యూల్ ఆనంద్‌కుమార్ - పంచాయతీరాజ్‌శాఖ వార్తలు

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శిగా శామ్యూల్ ఆనంద్‌కుమార్​కు పోస్టింగ్ ఇస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సారథ్యంలో పనిచేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Samuel Anand Kumar
శామ్యూల్ ఆనంద్‌కుమార్​కు పోస్టింగ్

By

Published : Feb 8, 2021, 8:29 PM IST

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఐ. శామ్యూల్ ఆనంద్ కుమార్​కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోనే శామ్యూల్ ఆనంద్ కుమార్ పని చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్సీ కార్పొరేషన్ వీసీ ఎండీగా శామ్యూల్ కుమార్ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది.

మరోవైపు వెయిటింగ్​లో ఉన్న ఐపీఎస్ అధికారి ఆవుల రమేష్ రెడ్డిని ఇంటెలిజెన్స్ వింగ్ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తిరుపతి అర్బన్ ఎస్పీ నుంచి సాధారణ పరిపాలన శాఖకు రమేష్ రెడ్డి రిపోర్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details