ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"చింతామణి" నాటకంపై.. ప్రభుత్వ నిషేధం! - చింతామణి నాటకం

"చింతామణి" నాటకంపై.. ప్రభుత్వ నిషేధం!
"చింతామణి" నాటకంపై.. ప్రభుత్వ నిషేధం!

By

Published : Jan 17, 2022, 9:37 PM IST

Updated : Jan 17, 2022, 10:43 PM IST

21:35 January 17

వెంటనే చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖకు ఆదేశాలు

ఈ తరానికి "చింతామణి" నాటకం గురించి పెద్దగా తెలియదుగానీ.. నిన్నటి తరానికి, గ్రామాల్లో ఉండే వారికి మాత్రం బాగా తెలుసు. "చింతామణి" నాటకం పేరు చెప్పగానే నవ్వులు విరబూస్తాయి. పల్లెల్లో అంతగా ప్రాచుర్యం పొందింది ఈ స్టేజీ నాటకం.

అయితే.. ఈ నాటకంపై ఇటీవలి కాలంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. "చింతామణి" నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని, సమాజాన్ని చైతన్యం చేయడానికి బదులుగా.. వ్యసనాల వైపు మళ్లిస్తోందంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే.. ఈ నాటకాన్ని నిషేధించాలంటూ ఆర్య వైశ్య సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధించింది.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖను ఆదేశించింది. ఈ నాటకంలోని సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ.. ఆర్యవైశ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటకాన్ని ప్రేక్షకులు చూడడం అసాధ్యమే!

ఇదీ చదవండి

మద్యం ప్రియులకు శుభవార్త.. సర్కారు కొత్త నిర్ణయం!

Last Updated : Jan 17, 2022, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details