ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్ కార్యదర్శిగా ఎం.ముకేష్ కుమార్ మీనా బదిలీ - IAS officer M. Mukesh Kumar Meena as secretary

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.ముకేష్ కుమార్ మీనాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

The government has appointed senior IAS officer M. Mukesh Kumar Meena as secretary to the state's governor Biswa Bhushan Harichandan.

By

Published : Aug 20, 2019, 6:15 AM IST

రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.ముకేష్ కుమార్ మీనాను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనా.. గవర్నర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. గవర్నర్ కార్యదర్శిగా ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ.. గిరిజన సంక్షేమశాఖ నుంచి ఆయన్ను తప్పించారు. మరోవైపు ఈ శాఖ బాధ్యతల్ని సంక్షేమశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు అప్పగించారు. తదుపరి ఉత్తర్వుల వెలువరించేంత వరకు గిరిజన సంక్షేమశాఖ బాధ్యతలు ఎం.రవిచంద్ర పర్యవేక్షిస్తారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details