ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Police: బంధువులు కరవై.. పోలీసులే ఆ నలుగురై! - అనాథ శవానికి అంత్యక్రియలు

లాక్​డౌన్ వేళ పోలీసులు మంచి మనసును చాటుకున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మానవత్వం చూపించారు. తెలంగాణ వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో ఓ అనాథ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు.

police humanity
పోలీసుల మానవత్వం

By

Published : May 29, 2021, 9:30 AM IST

లాక్‌డౌన్‌ వేళ ఓ వైపు క్షణం తీరిక లేకుండా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు ఓ అనాథ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు పోలీసులు. తెలంగాణలోని వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రానికి చెందిన శకుంతల(83) అనారోగ్యంతో బాధపడుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందింది. పూరి గుడిసెలో నివసిస్తున్న ఆమెకు నా అనే వారే కరవయ్యారు.

కరోనాతో మరణించిందేమోనన్న అనుమానంతో ఆ వృద్ధురాలి మృతదేహాన్ని తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎస్సై తిరుపాజీ.. శిక్షణ ఎస్సై రాజశేఖర్‌, సిబ్బంది కురుమన్న గౌడ్‌, రవికుమార్‌, శివకుమార్‌రెడ్డి, స్వాములు, అబ్దుల్‌ కలాంతో కలిసి ఆ అనాథ వృద్ధురాలి శవాన్ని పాడెపై శ్మశానానికి మోసుకెళ్లి ఖననం చేశారు. అన్నీ తామై అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులను పలువురు ప్రశంసించారు.

ఇదీ చూడండి:

Rape: ఎస్సై పిలుస్తున్నారంటూ తీసుకెళ్లి అత్యాచారం!

ABOUT THE AUTHOR

...view details