ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"ఆ జీవోతో... కొంపలు మునిగిపోయేదేమీ లేదు" - g.o. 2430 issue

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 2430 ద్వారా కలానికి సంకెళ్లు పడవని ప్రజా విధానాలపై ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి అన్నారు. ఇది కొత్తగా వచ్చిందేమీ కాదని... గతంలో ఉన్న జీవోనే కాస్త సరళీకరించి ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు.

కె.రామచంద్రమూర్తి

By

Published : Nov 1, 2019, 10:03 PM IST

మీడియా సమావేశంలో కె.రామచంద్రమూర్తి

దురుద్దేశ పూర్వక వార్తలను అరికట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజ్యాంగ విరుద్ధం కాదని ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి అన్నారు. ఈ జీవో చట్ట వ్యతిరేకం అంతకంటే కాదని చెప్పారు. గతంలో ఉన్న జీవోనే కాస్త సరళీకరించి ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. గతంలో వివిధ పత్రికల సంపాదకుడిగా పని చేసిన తానూ కేసులు ఎదుర్కొన్నానని తెలిపారు. భావ వ్యక్తీకరణ, ప్రకటన స్వేచ్ఛ... వ్యక్తి కి, సంస్థకు, ప్రభుత్వానికి ఒకేలా ఉంటుందని ఆయన అన్నారు. కోర్టు ముందు అంతా సమానమే అని గుర్తించాలన్నారు. ఈ జీవో వల్ల కొంపలు మునిగిపోయేదేమీ లేదని గుర్తించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details