తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ పరిధిలో సంచరిస్తున్న మానుపిల్లిని అటవీ సిబ్బంది బంధించారు. కొంతమంది స్థానికులు దానిని చూసి బ్లాక్ పాంథర్ అనుకుని భయాభ్రంతులకు గురయ్యారు. సంచరిస్తున్న మానుపిల్లి దృశ్యాలని తీసి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది.. అది బ్లాక్ పాంథర్ కాదని నిర్ధరించారు. మానుపిల్లిని జూపార్కుకు తరలించారు. తగిన రక్షణ చర్యలు తీసుకున్నట్లు పీసీసీఎఫ్ శోభ వెల్లడించారు. స్థానికులు ఎలాంటి భయాందోళన చెందవద్దని సూచించారు.
మహానగరంలో మానుపిల్లి హల్చల్ - నగరంలో సంచరిస్తోన్న మానుపిల్లి
బ్లాక్ పాంథర్... దర్జాగా నగరంలో తిరుగుతోంది... అది చూసిన స్థానికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. అటవీ శాఖకు సమాచారం మిచ్చారు. రంగంలోకి దిగిన సిబ్బంది... అది పాంథర్ కాదు.. మాను పిల్లి అని నిర్ధరించారు.
మహానగరంలో మానుపిల్లి హల్చల్
Last Updated : May 14, 2020, 11:27 AM IST