ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సస్పెన్స్‌ ఖాతా నుంచి రూ.వెయ్యి కోట్లు చెల్లింపు! - ఆర్‌బీఐ

రిజర్వు బ్యాంకుకు వెయ్యి కోట్లకుపైగా బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ సస్పెన్స్ ఖాతాను ఎంచుకోనున్నట్లు సమాచారం. ఆర్‌బీఐకు బిల్లుల ప్రతిపాదనలు పంపినా ఆర్థిక సంవత్సరం మారిన కారణంగా.. వాటిని వెనక్కి పంపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

The finance ministry is choosing a suspense account to pay the bills  to rbi
ఆర్‌బీఐ

By

Published : Apr 3, 2021, 9:11 AM IST

గత ఆర్థిక సంవత్సరం చివరి రోజున దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా వివిధ బిల్లులకు సంబంధించిన మొత్తాలు చెల్లించేందుకు రిజర్వు బ్యాంకుకు (ఆర్‌బీఐ) ప్రతిపాదనలు పంపినా చివరి నిమిషంలో చేరడంలో ఇబ్బందులేర్పడ్డాయని తెలిసింది. అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఆర్థిక సంవత్సరం మారడంతో ఆ బిల్లులను ఆర్‌బీఐ వెనక్కు పంపిందని సమాచారం. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ మొత్తం చెల్లింపునకు ఆర్థిక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

ఖజానా, సీఎఫ్‌ఎంఎస్‌, పే అండ్‌ అకౌంట్స్‌ అధికారులతో మాట్లాడి ఈ బిల్లుల చెల్లింపునకు సస్పెన్స్‌ ఖాతాను ఎంచుకోవాలని సూచించినట్లు తెలిసింది. సంబంధిత ప్రధాన పద్దు నుంచి (హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌) నిధులను సస్పెన్స్‌ ఖాతాకు మళ్లించి రూ.వెయ్యి కోట్లకుపైగా బిల్లులు చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details