AP Department of Finance: అనుమతిలేకుండా కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ఉత్తర్వులు వర్తింపచేసుకోవడంపై ఆర్థికశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. 62 ఏళ్లకు ఉద్యోగ విరమణ పెంపు ఉత్తర్వులు.. ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులకు మాత్రమే వర్తిస్తాయని తేల్చి చెప్పింది. న్యాయాధికారులు, గ్రామాధికారులు మినహా 309 అధికరణ కింద నియమితులైన ఉద్యోగులు, అధికారులకూ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది.
ఆ ఉద్యోగులకు మాత్రమే .. 62 ఏళ్లకు ఉద్యోగ విరమణ పెంపు: ఆర్థికశాఖ - ఆ ఉద్యోగులకు మాత్రమే
Superannuation: 62 ఏళ్లకు ఉద్యోగ విరమణ పెంపు ఉత్తర్వులు ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులకు మాత్రమే వర్తిస్తాయని ఆర్థికశాఖ తేల్చి చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సంస్థలు, కంపెనీలు, సొసైటీలు, విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో బోధనేతర సిబ్బందికి ఉద్యోగ విరమణ పెంపు ఉత్తర్వులు వర్తించవని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది.
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సంస్థలు, కంపెనీలు, సొసైటీలు, విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో బోధనేతర సిబ్బందికి ఉద్యోగ విరమణ పెంపు ఉత్తర్వులు వర్తించవని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ఆయా సంస్థల్లో ఉద్యోగ విరమణ పెంపు ఉత్తర్వులు జారీ చేయటం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్..మెమో సర్కులర్ జారీచేశారు. ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘనలపై సెప్టెంబరు 30లోగా నివేదికను పంపాలని ఆదేశించారు.
ఇవీ చదవండి: