అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ అమరావతినే రాజధానిగా ప్రకటించాలంటూ వినూత్నంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు కేబినెట్ సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్తున్న సమయంలో, అలాగే సచివాలయం నుంచి తిరిగి వెళ్తున్న సమయంలోనూ జై అమరావతి అంటూ నినదించారు. మందడం శిబిరంలో ఉన్న న్యాయదేవత విగ్రహాన్ని రోడ్డుపైకి తీసుకువచ్చి నిరసన తెలిపారు.
FARMERS PROTEST: సీఎం కాన్వాయ్ వెళ్తుండగా..మార్మోగిన అమరావతి నినాదాలు - అమరావతి రైతుల ఆందోళన
సీఎం జగన్ సచివాలయానికి వెళ్తున్న సమయంలో, సచివాలయం నుంచి తిరిగి వెళ్తున్న సమయంలోనూ అమరావతి రైతులు ఆందోళన చేశారు. మందడం శిబిరంలోని న్యాయదేవత విగ్రహం రోడ్డుపైకి తెచ్చి నిరసన తెలిపారు. సీఎం వాహనశ్రేణి మందడం దాటే వరకు జై అమరావతి అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
రైతుల ఆందోళన
విగ్రహాన్ని రోడ్డుపైకి తేవద్దంటూ పోలీసులు అడ్డుకోవడంతో.. రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి వాహనశ్రేణి సచివాలయానికి వెళ్తున్న సమయంలో రైతులు రోడ్డుపైకి రాకుండా పోలీసులు అడ్డంగా నిలబడ్డారు. అయినా రైతులు ఆకుపచ్చ జెండాలు చేతపట్టి వాహన శ్రేణి మందడం దాటే వరకు జై అమరావతి అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండీ..చిక్కిన భారీ సొర చేప.. ఔషధాల తయారీలో ఉపయోగం
Last Updated : Sep 16, 2021, 9:07 PM IST