Hyderabad Pub Raid Case : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని పుడింగ్ అండ్ మింక్‌లో లభించిన డ్రగ్స్ వ్యవహారంలో నెల రోజులు దాటుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం తేలలేదు. అరెస్ట్ అయిన పబ్ జనరల్ మేనేజర్ అనిల్‌కుమార్ మహాదారం, సహ భాగస్వామి ఉప్పల అభిషేక్ గుప్తా నుంచి పోలీసులు ఆశించినంత సమాచారం రాబట్టలేకపోయారు.
Pudding pump Drugs case : ఆ రెండు డ్రగ్స్ ఒకే రకం.. నిర్ధారించిన పోలీసులు - పుడింగ్ పబ్ కేసు లేటెస్ట్ న్యూస్
Hyderabad Pub Raid Case: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ లభించి నెలరోజులు దాటినా.. అక్కడికి డ్రగ్స్ ఎలా సరఫరా అయ్యాయనే దానిపై పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదు. నిందితుల నుంచి ఆశించినంత సమాచారం రాబట్టలేకపోయారు. మరోవైపు గతంలో పంజాగుట్ట ఠాణా పరిధిలో అరెస్ట్ అయిన టోనీ వద్ద దొరికిన డ్రగ్.. పుడింగ్ పబ్‌లో దొరికిన డ్రగ్ ఒకే రకమని పోలీసులు శాస్త్రీయంగా గుర్తించినట్లు సమాచారం. దీంతో పబ్‌లోకి డ్రగ్స్ నైజీరియన్లే సరఫరా చేశారన్న అనుమానం బలపడుతోంది.
Hyderabad Pub Raid Case Updates : అయితే ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు డ్రగ్స్‌ను వినియోగించాడనే కోణంలో అభిషేక్‌ను, అవసరమైన వారికి పబ్‌లో అందించారనే అనుమానంతో అనిల్‌కుమార్‌ను పోలీసులు విచారించారు. ఏప్రిల్ 2న జరిగిన వేడుకలో దాదాపు 10 మంది కోసం డ్రగ్స్ ఏర్పాటు చేసినట్లు భావించినా.. వారెవరు అనేది మాత్రం గుర్తించలేకపోయారు. మరోవైపు చాలా నెలల సీసీ ఫుటేజీని పరిశీలించి, అభిషేక్, అనిల్‌కుమార్‌తో పరిచయం ఉన్న వారిని గుర్తించడంతో పాటు డ్రగ్స్ సరఫరా గురించి తెలుసుకొనే ప్రయత్నం చేసినా ఫలితం అంతగా లేకపోయిందనే విమర్శలు ఉన్నాయి.
Pudding Pub Raid Case Updates : గతంలో పంజాగుట్ట ఠాణా పరిధిలో అరెస్ట్ అయిన టోని వద్ద పట్టుబడినది, పబ్‌లో దొరికింది ఒకే రకం డ్రగ్ అని పోలీసులు శాస్త్రీయంగా గుర్తించినట్లు తెలుస్తుంది. పబ్‌లో పట్టుబడిన డ్రగ్ సైతం నైజీరీయన్ల నుంచి సేకరించిందేనన్న అనుమానం బలపడుతోంది. పబ్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 4.64గ్రాముల కొకైన్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్‌కు పంపారు. ఈ అంశంపై మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారిస్తామని పేర్కొన్నారు.