అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పదవుల పంపకాలు నిర్ణయమయ్యాయి. కీలకనేతగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటివరకూ ఉత్తరాంధ్రలో పార్టీని పర్యవేక్షిస్తుండగా.. ఆ బాధ్యత నుంచి తప్పించి పార్టీ కేంద్ర కార్యాలయానికి మారుస్తారని తెలిసింది. ఇప్పటికే పార్టీ అనుబంధ విభాగాలన్నింటి పర్యవేక్షణ బాధ్యత సాయిరెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఆయన విశాఖను వదులుకుంటారా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
YSRCP: వైకాపాలో పదవుల పంపకాలు..నేడు అధికారికంగా జాబితా! - ap latest news
వైకాపాలో సంస్థాగత పదవుల పంపకాలు నిర్ణయమయ్యాయి. మాజీ మంత్రుల్లో కొందరికి వారి సొంత జిల్లాల పార్టీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నియామకాల తుది జాబితా మంగళవారం సీఎం విశాఖ పర్యటన ముగించుకుని వచ్చాక వెలువడనుంది.
సోమవారం రాత్రి వరకు ఉన్న సమాచారం మేరకు.. సీనియర్ మంత్రి బొత్సకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల బాధ్యతలను అప్పగించనున్నారు. నియామకాల తుది జాబితా మంగళవారం సీఎం విశాఖ పర్యటన ముగించుకుని వచ్చాక వెలువడనుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమన్వయకర్తల వివరాలు చూస్తే.. తూర్పుగోదావరికి వైవీ సుబ్బారెడ్డి, పశ్చిమగోదావరికి మిథున్‌రెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కొడాలి నాని, (ఇందులో పల్నాడు జిల్లా బాధ్యత మోపిదేవికే), ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూలు, కడప జిల్లాలకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలను బాధ్యులుగా నియమించే అవకాశం ఉందని సమాచారం. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు మంత్రి పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. వీటిలో ఏ మార్పులూ లేకపోతే సజ్జలకు ప్రత్యేకంగా జిల్లా బాధ్యతలు కేటాయించకుండా పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా కొనసాగించే అవకాశంఉందని తెలుస్తోంది. తాజా మాజీ మంత్రుల్లో కొందరికి వారి సొంత జిల్లాల పార్టీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి:వాటిలో నాణ్యత తప్పనిసరి.. లేదంటే తీవ్ర చర్యలు: సీఎం జగన్