రాష్ట్రానికి వెచ్చించిన నిధుల వివరాలను కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. భాజపా ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు సమాధానంగా... కేంద్ర ఆర్థిక శాఖ సమాధానం లెక్కలు తెలిపింది. కరోనా వైద్య సేవల కోసం రాష్ట్రానికి రూ.324.27 కోట్లు, జాతీయ ఆరోగ్య మిషన్ కింద రూ.998.91 కోట్లు, విపత్తు నిర్వహణ నిధి ద్వారా రూ.1,119 కోట్లు కేటాయించినట్టు వివరించింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.2234.20 కోట్లు, ప్రత్యేక సహాయం కింద రాష్ట్రానికి రూ.344 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది.
పోలవరానికి రూ.2234.20 కోట్లు.. కేంద్రం వెల్లడి - ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సమాధానం
తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ లో కేటాయించిన నిధుల వివరాలు చెప్పాలన్న భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు.. కేంద్రం సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు రూ.2234.20 కోట్లు, కరోనా వైద్య సేవల కోసం రూ.324.27 కోట్లు కేటాయించినట్టు వెల్లడించింది.
పోలవరానికి రూ.2234.20 కోట్లు కేటాయింపు.. కేంద్రం వెల్లడి