ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్తు వినియోగం - Department of Energy responding on power consumption in the state

రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిందని ఇంధన శాఖ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే వినియోగం సుమారు 23 శాతం పెరిగిందని వెల్లడించారు.

consumption of electricity
విద్యుత్తు వినియోగం

By

Published : May 17, 2021, 9:56 AM IST

కొవిడ్‌ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిందని ఇంధన శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ ఏడాది మే మొదటి వారంలో 1,399 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్తు వినియోగిస్తే.. గతేడాది ఇదే సమయంలో 1,139 ఎంయూ ఉంది. గతేడాదితో పోలిస్తే వినియోగం సుమారు 23 శాతం పెరిగింది.

జూన్‌లో వినియోగం 13 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా. గత ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా పారిశ్రామిక వినియోగం తగ్గటం వల్ల సుమారు రూ.4,300 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చింది’ అని పేర్కొంది. డిమాండ్‌ పెరిగినా సేవల్లో ఇబ్బంది తలెత్తుకుండా చూడాలని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌ విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details