ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీని నిలిపివేస్తూ ఎస్ఈసీ నిర్ణయం - ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ నిలుపుదల
ఉగాదికి ప్రభుత్వం చేపట్టాల్సిన ఇళ్ల స్థలాల పంపిణీ నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. హైకోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఓటర్లను ప్రలోభపెట్టే వ్యక్తిగత లబ్ధి కార్యక్రమాలను నిలుపుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ నిలుపుదల