స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో అరెస్ట్ అయిన ఆసుపత్రి సిబ్బంది ముగ్గురిని కస్టడీ కోరుతూ పోలీసులు విజయవాడ కోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిపింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కస్టడీకి ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
మరోవైపు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం 21వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులనుకోర్టు ఆదేశించింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేష్ ఆసుపత్రి ఎండీ ఎనిమిదో అదనపు జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.