జగన్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా గ్రామ పంచాయతీలకు వైకాపా జెండా రంగులు వేయించిందని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వానికి హైకోర్టు మెుట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. రంగులు చెరిపేందుకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి జగన్ నుంచే వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.
'రంగులు చెరిపేందుకు ఖర్చును జగన్ నుంచే వసూలు చేయాలి' - జగన్ పై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కామెంట్స్
గ్రామ సచివాలయాలు, గ్రామ పంచాయతీలకు రంగులు వేసుకునే అధికారం జగన్ ప్రభుత్వానికి ఎక్కడిదని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. రంగులు చెరిపేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించిందని.. దానికి అయ్యే ఖర్చును జగన్ నుంచే వసూలు చేయాలన్నారు.
ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్