ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు అనుమతి - ఎంపీ రఘురామ వార్తలు

రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలుకు కేెంద్రం అనుమతినిచ్చింది. భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయాలకు అనుమతులు ఇచ్చామని, అందులో ఓర్వకల్లులో కార్యకలాపాలు 2021 మార్చిలోనే ప్రారంభమయ్యాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

three airports
విమానాశ్రయాలకు అనుమతి

By

Published : Jul 30, 2021, 9:35 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు కేంద్రం సూత్రప్రాయ అనుమతులు ఇవ్వగా.. అందులో ఒకటి ఇప్పటికే ప్రారంభమైనట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇప్పటివరకు భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయాలకు అనుమతులు ఇచ్చామని, అందులో ఓర్వకల్లులో కార్యకలాపాలు 2021 మార్చిలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి రూ.2,500 కోట్లు, దగదర్తికి రూ.293 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. విమానాశ్రయాల నిర్మాణం, నిధుల సేకరణ బాధ్యత అంతా వాటిని అభివృద్ధి చేసే వారిదేనని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా.. పీపీపీ/ జాయింట్‌ వెంచర్‌ విమానాశ్రయాల ద్వారా 2020-21 వరకు రూ.30,069 కోట్లు సంపాదించిందని ఆయన మరో ప్రశ్నకు బదులిచ్చారు. హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా కన్సెషన్‌ ఫీజు రూపంలో 2020-21లో కేంద్రానికి రూ.856 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకే పేర్ల మార్పు

విమానాశ్రయాలు, టర్మినల్‌ సముదాయాలకు కొత్తగా పేర్లు పెట్టడం, ఉన్నపేర్లు మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి, కేంద్రానికి సిఫార్సు చేయాల్సి ఉంటుందని జనరల్‌ వీకే సింగ్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. ‘రాష్ట్రాలు తీర్మానం పంపినా.. తుది నిర్ణయాధికారం కేంద్ర కేబినెట్‌దే. ఇప్పటివరకు విమానాశ్రయాలకు పేర్లు పెట్టడం, మార్చడంపై 13 రాష్ట్రాల నుంచి అసెంబ్లీ తీర్మానాలు వచ్చాయి’ అని చెప్పారు.

ఏటా 4.43 కోట్ల టన్నుల బొగ్గు అవసరం

విద్యుత్తు ఉత్పత్తి కోసం ఏపీలోని 9 థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకు ఏటా 4.43 కోట్ల టన్నుల బొగ్గు అవసరమని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. తెలంగాణలోని 8 ప్రాజెక్టులకు 3.23 కోట్ల టన్నులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గురువారం లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఏపీలోని 17 గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు కేంద్రాలకు రోజూ 24.08 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ అవసరమున్నట్లు తెలిపారు. గత మూడేళ్లుగా బొగ్గు లభ్యత తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి

BOTSA ON HOUSES: టిడ్కో ఇళ్లు 18 నెలల్లోగా ఇస్తాం: మంత్రి బొత్స

ABOUT THE AUTHOR

...view details