ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పిల్లల పేరు నమోదు చేయకుంటే కష్టాలే! - పిల్లల పుట్టినరోజు రిజిస్ట్రేషన్ వార్తలు

కాన్పు అయ్యాక రిజిస్ట్రేషన్‌లో నిర్లక్ష్యం వహించవద్దని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. విత్‌ నేమ్‌ సర్టిఫికెట్‌ సాధ్యమైనంత త్వరగా పొందడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనాలు సిద్ధిస్తాయని వివరిస్తోంది. ప్రస్తుతానికి ఐదేళ్ల పాటు కేంద్రం వెసులుబాటునిచ్చింది.

The Central Government advises not to neglect registration after the birth of a child.
పిల్లల పేరు నమోదు చేయకుంటే కష్టాలే!

By

Published : Jan 31, 2021, 10:06 AM IST


బాబు లేదా పాప పుట్టాక స్థానిక సంస్థల కార్యాలయాల్లో వారి పేరు నమోదులో నిర్లక్ష్యం వహించవద్దని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. విత్‌ నేమ్‌ సర్టిఫికెట్‌ సాధ్యమైనంత త్వరగా పొందడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనాలు సిద్ధిస్తాయని వివరిస్తోంది. దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఈ సమస్య ఎదురవుతున్న దృష్ట్యా పేర్ల రిజిస్ట్రేషన్‌కు కేంద్రం ఐదేళ్ల వెసులుబాటునిచ్చింది.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, ఇళ్లలో కాన్పు అయ్యాక వివరాలు పురపాలక లేదా పంచాయతీ కార్యాలయాలకు వెళ్తాయి. బిడ్డ పుట్టిన 21 రోజుల్లోపే దీన్ని రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఇది పూర్తయ్యాక ఏడాదిలోపు స్థానిక సంస్థలో పేరు నమోదు చేయించుకుంటే ఫీజుండదు. ఆ తరవాత నుంచి 15ఏళ్ల వరకు పేరు నమోదుకు రూ.5 ఆలస్య రుసుము తీసుకుంటారు. ఈ కాలవ్యవధి దాటితే ఎలాంటి అవకాశం ఉండదు. ప్రస్తుతం ఈ గడువును మరో ఐదేళ్లకు కేంద్రం పెంచుతూ తక్షణం అమల్లోకి వచ్చేలా ఆదేశాలనిచ్చింది. ఈ క్రమంలో అవసరమైన వారు అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. సాధారణంగా బిడ్డ పుట్టిన నెలలోగా పేరు పెడతారు. పేరును ప్రభుత్వ రికార్డుల్లోకి చేర్పించుకోని వారు ఇబ్బంది పడుతున్నారు.

సమస్యలివి..
* అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాల్లో గ్రీన్‌కార్డు పొందే సమయంలో ఈ సర్టిఫికెట్‌ అవసరం ఎక్కువ.
* చైల్డ్‌ విత్‌ నేమ్‌ సర్టిఫికెట్లు తప్పనిసరనే విద్యాసంస్థలూ ఉన్నాయి.
* ఆధార్‌ కార్డుల్లో వయస్సు వివరాల నమోదులో దొర్లిన తప్పులను సవరించేందుకు ఒక్కోసారి ఈ సర్టిఫికెట్‌ అవసరమవుతుంది.
* సర్టిఫికెట్‌ లేనట్లయితే పదో తరగతి వరకు చదవని వారికి విదేశాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ఇదీ చదవండి:పిల్లల్ని ఎత్తుకెళ్లే రాబందులు

ABOUT THE AUTHOR

...view details