ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: దొంగలను పట్టించిన నిఘానేత్రం... ఏం దొంగిలించారో తెలుసా! - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

సాధారణంగా బంగారం, డబ్బు లేదా విలువైన వస్తువులు దొంగిలించడం చూస్తుంటాం. కానీ ఓ ఆటో డ్రైవర్​ చేసిన చోరీ తెలిస్తే నవ్వురాకమానదు. ఇంతకీ ఆ ఆటో డ్రైవర్​ చేసిన దొంగతనం ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

దొంగలను పట్టించిన నిఘానేత్రం
దొంగలను పట్టించిన నిఘానేత్రం

By

Published : Feb 15, 2021, 1:07 AM IST

తెలంగాణలోని ఆదిలాబాద్​ జిల్లా ద్వారకానగర్​లోని పాల విక్రయ కేంద్రానికి ఓ పెద్దాయనతో పాటు ఆటో డ్రైవర్​ వచ్చాడు. దుకాణం యజమానిని మాటల్లో పెట్టి బిస్కెట్ ప్యాకెట్, మిఠాయిల డబ్బాను చోరీ చేశాడు. ఈ క్రమంలో ఓ ప్యాకెట్​ కిందపడిపోయింది. ఈ విషయాన్ని పసిగట్టి దుకాణం యజమాని వారిని ప్రశ్నించింది.

దొంగలను పట్టించిన నిఘానేత్రం

తాము ఏమి దొంగిలించ లేదని ఆటో డ్రైవర్​ బుకాయించాడు. అనంతరం సీసీ కెమెరాల్లో రికార్డు అయిన చోరీ దృశ్యాలు చూసి తప్పును ఒప్పకున్నారు. అయితే పాలదుకాణం యజమాని వారిని క్షమించి వదిలేసింది.

ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన టెంపో వాహనం.. 14 మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details