ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. నలుగురు నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్ - posts against judges in social media case updates

cbi
సీబీఐ

By

Published : Sep 13, 2021, 3:07 PM IST

Updated : Sep 13, 2021, 5:01 PM IST

14:59 September 13

జడ్జిలపై పోస్టుల కేసు..

 న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ అధికారులు ఇప్పటివరకు నలుగురు నిందితులపై ఛార్జ్​షీట్ దాఖలు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ధనిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్, పట్టపు ఆదర్శ్, లవణూరు సాంబశివరెడ్డిలపై వేర్వేరుగా ఛార్జ్​షీట్ దాఖలు చేశారు. గుంటూరులోని సీబీఐ డిజిగ్నేటెడ్ కోర్టులో ఛార్జ్​షీట్లను దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నలుగురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో గతేడాది నవంబర్ 11న 16 మంది నిందితులపై కేసు సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఐడీ నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్​ల దర్యాప్తు నివేదికను సీబీఐ స్వాధీనం చేసుకుంది.

     వివిధ వ్యాజ్యాల్లో న్యాయస్థానం తీర్పుల వెల్లడి అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా, న్యాయమూర్తులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పేర్కొంటూ హైకోర్టు అప్పటి ఇన్​ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం 2020 అక్టోబర్ 12న దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. 

ఇదీ చదవండి

JEE Mains 2021: మెయిన్స్​ ఫలితాలు నేడే.. అడ్వాన్స్​డ్ రిజిస్ట్రేషన్లు కూడా...

Last Updated : Sep 13, 2021, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details