జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భూ కేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో హెటిరో, అరబిందోతో పాటు దాల్మియా కేసులోని నిందితులు అభియోగాల నమోదు, డిశ్ఛార్జి పిటిషన్లలో వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉండాలని సీబీఐ కోర్టు గురువారం స్పష్టం చేసింది. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
CBI on jagan: ఆ కేసుల్లో వాదనలకు సిద్ధం కండి - జగన్ అక్రమాస్తుల కేసు తాజా సమాచారం
అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన హెటిరో, అరబిందోతో పాటు దాల్మియాకు భూ కేటాయింపులపై వాదనలు వినిపించడానికి జగన్ సిద్ధంగా ఉండాలని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల వ్యవహారం
రాంకీ కేసులో నిందితుడైన ఎంపీ అయోధ్యరామిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్‌పై వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది రావాల్సి ఉందని, వాయిదా వేయాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించగా సీబీఐ కోర్టు అనుమతించింది. వాన్‌పిక్, జగతి పబ్లికేషన్స్‌పై కేసుల విచారణనూ 18కి వాయిదా వేసింది.
ఇదీ చదవండీ..తెదేపా నేతల ఫిర్యాదులపై.. సీఐడీ పట్టించుకోవడంలేదు: అశోక్ బాబు