తెలంగాణలో.. ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఇతర నిందితులకు అనిశా న్యాయస్థానం చివరి అవకాశం కల్పించింది. తనకు లంచం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు చేసిన స్టీఫెన్ సన్ను ఈ కేసులో మొదటి సాక్షిగా అనిశా పేర్కొంది.
స్టీఫెన్ సన్పై ప్రధాన విచారణ పూర్తి చేసి వాంగ్మూలం నమోదు చేసిన ఏసీబీ కోర్టు.. క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు చివరి అవకాశం ఇచ్చింది. ఇవాళ స్టీఫెన్ సన్ కోర్టుకు హాజరైనప్పటికీ... తమకు కొంత సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను జూన్ 2కి వాయిదా వేసింది.