ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: చైతన్యపురిలో కారు బీభత్సం.. సీసీలో దృశ్యాలు నిక్షిప్తం

అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపు తప్పి షాపులోకి దూసుకువెళ్లిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్​ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన చోట ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

By

Published : Mar 28, 2021, 1:47 PM IST

car trash
తెలంగాణ: చైతన్యపురిలో కారు బీభత్సం.. సీసీలో దృశ్యాలు నిక్షిప్తం

తెలంగాణ: చైతన్యపురిలో కారు బీభత్సం.. సీసీలో దృశ్యాలు నిక్షిప్తం

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్​ స్టేషన్ పరిధిలోని వాసవి కాలనిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో కారు అదుపుతప్పి ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. కారు షాపులోకి దూసుకువెళ్లడంతో సామగ్రి​ ధ్వంసమైంది. సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వెంకటేష్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు.. ఘటన జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details