BRIDE SUICIDE: తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేశారని.. అప్పగింతలు కాకముందే.. ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌లోని పాతతోటకు చెందిన గజ్జల పద్మకు నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడే భర్త మరణించడంతో కూలీ పనులు చేస్తూ పిల్లలను చదివించింది.
తన పెద్ద కూతురు లక్ష్మి(19)కి పెళ్లి చేయాలని నిశ్చయించి.. దూరపు బంధువు అయిన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన యువకునితో పెళ్లి సంబంధం ఖాయం చేసింది. అంత దూరం సంబంధం చేసుకోవడం తనకు ఇష్టం లేదని తల్లితో పలుమార్లు చెప్పినప్పటికీ.. లక్ష్మికి నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. శుక్రవారం ఉదయం బంధువులు, మిత్రుల సమక్షంలో వైభవంగా పెళ్లి జరిపించారు. వివాహం అనంతరం వరుడితో కలిసి లక్ష్మి నృత్యాలు సైతం చేసింది.