Electric shock to boy: గాలిపటం కోసం విద్యుత్ స్తంభం ఎక్కిన ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ములుగుకు చెందిన పన్నెండేళ్ల బాలుడు.. గాలిపటం ఎగురవేస్తుండగా అది విద్యుత్ స్తంభానికి చిక్కుకుపోయింది. దీంతో పతంగి కోసం బాలుడు విద్యుత్ స్తంభం ఎక్కాడు. అయితే.. కరెంట్ సరఫరా అవుతుండడంతో.. షాక్‌కు గురయ్యాడు.
గాలిపటం కోసం స్తంభం ఎక్కిన బాలుడికి.. కరెంట్ షాక్! - గాలిపటం కోసం స్తంభం ఎక్కిన బాలుడికి కరెంట్ షాక్
పతంగి కోసం బాలుడు విద్యుత్ స్తంభం ఎక్కి.. కరెంట్ షాక్‌కు గురయ్యాడు. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
గాలిపటం కోసం స్తంభం ఎక్కిన బాలుడికి కరెంట్ షాక్
అప్రమత్తమైన లైన్‌మెన్ కరెంటు సరఫరా నిలిపేసి బాలుడిని కిందికి దింపారు. అపస్మారకస్థితిలో ఉన్న చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చదవండి:వారితో ప్రాణహాని ఉంది.. ఎమ్మెల్సీపై వైకాపా వార్డు సభ్యురాలు తీవ్ర ఆరోపణలు!