ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధం: అమరావతి ఐకాస

అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి అన్నారు. కరోనా విపత్కర సమయంలో రాజధాని బిల్లును గవర్నర్‌కు పంపటం ఏంటని ఐకాస సహ సమన్వయకర్తలు ప్రశ్నించారు.

The bill repealing  CRDA Act is unconstitutional says amaravathi jac
సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్న అమరావతి ఐకాస

By

Published : Jul 19, 2020, 1:50 PM IST

సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్న అమరావతి ఐకాస

అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి అన్నారు. గత 215 రోజులనుంచి నిర్విరామంగా పోరాటం చేస్తూ... ఇప్పటివరకు 67మంది ప్రాణాలు వదిలారన్నారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం రాజధాని బిల్లును గవర్నర్‌కు పంపటం ఏంటని ఐకాస సహ సమన్వయకర్తలు తిరుపతిరావు, స్వామి ప్రశ్నించారు. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వ పునరాలోచించాలని వారు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ బిల్లులను ఆమోదిస్తే... మున్ముందు ‌దేశంలో ఎక్కడా ఏ రైతు కూడా ప్రభుత్వానికి భూమి ఇవ్వబోరని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని రాష్ట్రాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సంఖ్యాబలం ఉందని... అధికారపక్షం ఇష్టం వచ్చినట్లు‌ చేస్తే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోక తప్పదన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి అమరావతికి అండగా ఉండాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details