Peacock Tree :పైభాగం ఎండిపోయి, కింద పచ్చదనంతో కనిపిస్తున్న ఈ వృక్షం పేరు ‘నెమలి’. పైన ఎండిపోయినవన్నీ కాయలు. కింద పచ్చగా ఉన్నవి ఆకులు.తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడి నుంచి చిన్నపొర్లకు వెళ్లే మార్గంలోని ఈ నెమలి చెట్టు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది.
'షూ'లో పక్షిగూడు.. ఆకట్టుకునేట్టు నెమలి చెట్టు - bird nest in shoe in jangaon
కాంక్రీట్ జంగిల్‌గా మారిన పట్టణాల్లో రమణీయమైన ప్రకృతిని చూడాలనుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త పెద్ద కోరికే. కానీ అప్పుడప్పుడు మాత్రం ఏదో ఓ చోట కళ్లను కట్టిపడేసే.. మనసుకు ఆహ్లాదం కలిగించే దృశ్యాలు కనిపిస్తాయి. అలాంటి దృశ్యాలే తెలంగాణలోని నారాయణపేట జిల్లా పులిమామిడిలో.. జనగామ జిల్లా కలెక్టరేట్‌లో కనువిందు చేశాయి.
Bird Nest : పక్షులకు చెట్టూచేమలే ఆవాసాలుగా ఉండేవి. పట్టణీకరణ నేపథ్యంలో ఇప్పుడవి అంతరిస్తుండడంతో పక్షులు ఇళ్లనే ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. వాటికి ఎక్కడ భద్రంగా అనిపిస్తుందో అక్కడే గూడును ఏర్పరచుకుంటున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రం. తెలంగాణలోని జనగామ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎంలను భద్రపరిచే గోదాము ఉంది. దానికి నిత్యం పోలీసు సిబ్బంది కాపలాగా ఉంటారు. వారిలో ఒకరి పాత పాదరక్ష(బూటు) గోదాము ఆవరణలో పడి ఉంది. అందులో ఓ పక్షి కొన్ని రోజులుగా గూడు నిర్మించుకుంది. అనువైన ప్రదేశంగా భావించిన పక్షి తాజాగా ఇక్కడే మరో రెండు పిల్లలకు జన్మనిచ్చింది.