ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్​పై 10 శాతం వ్యాట్ పెంపు - VAT Act news

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలకు నిధులు కావాల్సి ఉన్నందునే.... సహజ వాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు సహజవాయువుపై 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్ను పెంచుతూ వాణిజ్యపన్నుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

the-ap-has-issued-orders-raising-taxes-under-the-vat-act-on-natural-gas-in-the-state
నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్​పై 10 శాతం వ్యాట్ పెంపు

By

Published : Sep 12, 2020, 12:46 PM IST

Updated : Sep 12, 2020, 1:31 PM IST

కోవిడ్​ కారణంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు సహజవాయువుపై వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతున్నట్టుప్రభుత్వం ప్రకటించింది. 14.5 శాతంగా ఉన్న పన్నును 24. 5 శాతానికి పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలకు భారీ ఎత్తున నిధులు కావాలని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవో స్పష్టం చేసింది.

రాష్ట్రంలో సహజవాయువుపై ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్ను పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను వసూలు చేస్తుంది. ముడి చమురుపై 5 శాతం మేర, పెట్రోలుపై 31 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర పన్ను వసూలు చేస్తుంది. డీజిల్​పై 22.5 శాతంతోపాటు అదనంగా 4 రూపాయల మేర వ్యాట్ వసూలు, ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ పై 1 శాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తుంది.

కొవిడ్ కారణంగా పన్నులపై ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఆదాయం కోల్పోయినందున సహజవాయువుపై అదనంగా 10 శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 2020 నెలకు 4 వేల 480 కోట్లరూపాయల ఆదాయం రావాల్సి ఉన్నా.... కేవలం 1,323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా, నాడు నేడు, టెలిమెడిసిన్, సున్నావడ్డీ, జగనన్న విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మఒడి లాంటి పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున సహజవాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఇదీ చదవండి:అంతర్వేది కొత్త రథం ఆకృతి సిద్ధం

Last Updated : Sep 12, 2020, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details