ఆంధ్రప్రదేశ్‌లో పలువురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఐదుగురు అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా, 40 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్ లభించింది. 2019-20 ప్యానల్ సంవత్సరానికి సంబంధించిన జాబితాలోని అధికారులకు ఉద్యోగోన్నతి కల్పించారు. నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు పొందిన వారిలో షేక్ నవాబ్‌జాన్, బి. అచ్యుతరావు, జి.ఆంజనేయులు, ఎంవీఎస్ స్వామి, వై.తిమ్మనాయుడులు ఉన్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు పదోన్నతి - AP government news
రాష్ట్రంలో పలువురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ...ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా, 40 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్ లభించింది.
అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు పదోన్నతి