ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి భారీ రుణ సాయానికి ఏఐఐబీ అంగీకారం - ఏపీకి ఏఐఐబీ సాయం

AIIB
AIIB

By

Published : Feb 6, 2020, 9:32 PM IST

Updated : Feb 6, 2020, 10:07 PM IST

21:25 February 06

రాష్ట్రానికి రుణం ఇచ్చేందుకు ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ)ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్​ను కలిసిన ఏఐఐబీ ప్రతినిధుల బృందం.... కొత్తగా 3 బిలియన్‌ డాలర్ల రుణం ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. నిర్ణయించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ మొత్తాన్ని ఖర్చు చేసుకోవచ్చని వెల్లడించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, రోడ్లు, వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందిస్తామని ఏఐఐబీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఏఐఐబీ ప్రతినిధులకు సీఎం జగన్ వివరించారు. నాడు– నేడు కార్యక్రమాలను బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. నాలెడ్జ్‌ మీద పెట్టుబడులుగా అభివర్ణించారు. ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా సీఎం జగన్​ను ఆహ్వానించారు. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నంలో పోర్టులను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. ఒక పోర్టుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. అలాగే గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి సహాయం చేస్తామని ఏఐఐబీ ప్రతినిధులు తెలిపారు.

Last Updated : Feb 6, 2020, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details