ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెల్లు బికిన ప్రజాగ్రహం... అట్టుడికిన అమరావతి ప్రాంతం - mandadam news

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. అమరావతి గ్రామాలు అట్టుడికాయి. వైకాపా నేతల మీడియా సమావేశం అనంతరం ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. మందడంలో రాత్రి పొద్దుపోయే వరకూ రైతులు మహాధర్నా కొనసాగించారు. వివిధ గ్రామాల్లో దారిపొడవునా గ్రామస్థులు టైర్లు తగులబెట్టి నిరసనలు తెలిపారు. నేడు మంత్రివర్గ భేటీ  వేళ ఏ క్షణాన ఏం జరుగుతుందోననే అప్రకటిత యుద్ధ వాతావరణం రాజధాని గ్రామాల్లో నెలకొంది.

The agitations continued on the 9th at Amravati
ఉద్యమం.. ఉద్ధృతం

By

Published : Dec 27, 2019, 4:30 AM IST

పెల్లు బికిన ప్రజాగ్రహం... అట్టుడికిన అమరావతి ప్రాంతం

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అన్నదాతలు ఆందోళనలు తొమ్మిదో రోజూ మిన్నంటాయి. గురువారం కృష్ణ, గుంటూరు జిల్లాల వైకాపా నేతలు చేసిన ప్రకటనతో మందడంలో నిరసన చేస్తున్న రైతుల్లో ఆవేశం కట్టలుతెంచుకుంది. మందడంలో మహాధర్నాను రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగించారు. పోలీసులు బలవంతంగా2 టెంట్లను తొలగించినా మరో 2టెంట్ల కింద రైతులు, మహిళలు పెద్దఎత్తున బైఠాయించి.... రక్తాన్నైనా చిందిస్తాం అమరావతిని సాధిస్తాం అంటూ జాతీయ జెండాలు పట్టుకుని నినదించారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను నిరసిస్తూ రహదారులపై టైర్లు తగులపెట్టి నిరసన తెలిపారు. వివిధ గ్రామాల్లో రహదారి పొడవునా టైర్లు తగలపెట్టారు. రాత్రి పొద్దుపోయాక రైతులు కూర్చుండగానే టెంట్ తాడులు పోలీసులు కోయించివేశారు. గ్రామస్థులు, మహిళలపై టెంటు పడింది. పోలీసులు టెంట్ తొలగించిన తర్వాతా కొందరు రైతులు పరదాలపైనా పడుకుని నిరసనలు కొనసాగించారు. కొందరు క్యారమ్స్‌ ఆడుతూ నిరసనలు తెలిపారు.

ఎమ్మెల్యే ఆర్కే ఇంటికి వినతిపత్రం
రాజధాని రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా సచివాలయం చుట్టు పక్కల గ్రామాల యువత గురువారం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు. మందడం, మల్కాపురం, వెలగపూడి గ్రామాల్లో బైక్ ర్యాలీ చేశారు. ట్రాక్టర్​పై ర్యాలీగా వెళ్తున్న మహిళలను అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. నిన్న సాయంత్రం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇంటికి చేరుకున్న అమరావతి అఖిలపక్షం నేతలు, రైతులు ఆయన ఇంటికి వినతిపత్రాన్ని అంటించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని అందులో కోరారు.

నేడు కొనసాగనున్న ఆందోళనలు
నేడు ఉద్ధండరాయుని పాలెంలో 29 గ్రామాల ప్రజలు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఇతర ముఖ్యనేతలు అక్కడే మౌనదీక్ష చేపట్టనున్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామాన ఎవరికి తోచిన విధంగా వారు నిరసనలు తెలపనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఎవరికి తోచిన విధంగా వారు ఆందోళనలు చేపట్టనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెం గ్రామాల్లో పదో రోజూ రైతులు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు.

ఇదీ చదవండి:నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు!

ABOUT THE AUTHOR

...view details