ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో థియేటర్ల మూసివేతపై స్పష్టతనిచ్చిన మంత్రి తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తాజా వార్తలు

కొవిడ్​ వ్యాప్తి కారణంగా నేటి నుంచి విద్యాసంస్థలు మూసివేసిన తెలంగాణ ప్రభుత్వం.. సినిమా థియేటర్లనూ బంద్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర మంత్రి తలసాని.. ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. వదంతులు నమ్మవద్దని.. థియేటర్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

telangana minister talasani clarity on theatres close fake news
తెలంగాణలో థియేటర్ల మూసివేతపై మంత్రి తలసాని స్పష్టత

By

Published : Mar 24, 2021, 5:22 PM IST

తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఆ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. థియేటర్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. నేటి నుంచి విద్యాసంస్థలు మూసివేసిన ప్రభుత్వం.. థియేటర్లనూ బంద్ చేసిందనే వదంతులు విస్తరిస్తున్న సందర్భంలో మంత్రి స్పష్టతనిచ్చారు.

థియేటర్ నిర్వాహకులు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని మంత్రి సూచించారు. రోజురోజుకూ కరోనా కోరలు చాస్తున్న కారణంగా మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మాస్కులు, భౌతిక దూరం విస్మరించవద్దని ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details